దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం
నువ్వు విసిరినా విజిల్ పిలుపొక
గజల్ కవితగా మారే
చెవినది పడి కవినయ్యానే
తెలియదు కదా పిరమిడులను
పడగొట్టే దారే
నీ ఊహల పిరమిడు నేనే
దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం
నలుపని తెలిసి కనులకు రాసి
కాటుకనేమో తెగ పొగిడేస్తావే
క్షణమొక రంగే నీకై పొంగే
నా హృదయాన్నె మరి కసిరేస్తావే
ఇటు వెళ్లిన నువ్వే అటు కనిపిస్తావే
ఎటు వెళ్లని వల వేస్తావే
ఏంచేశానంటూ నను నిలదీస్తావే
ఏం చేయలేక చూస్తూ ఉంటె జాలి చూపవే
దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం, హ హా
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇకడే ఉన్నావని అర్ధం
తేనెలో పడడం చీమకు ఇష్టం
నీ ప్రేమలో పడడం నాకింకా ఇష్టం
ఉల్కలు పడితే భూమికి నష్టం
నువ్వు కనబడకుంటే నాకింకా కష్టం
రాసిన రాతైనా మళ్ళీ రాస్తున్న
విసుగుండదు ఇది ఏం కవితో
రోజు చూస్తున్నా… మళ్ళీ వస్తున్న
నిను ఎంత చూడు కనులకసలు తనివి తీరదే
దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం