Song Name:ధూమ్ ధామ్ ధోస్థాన్
Movie:దసరా
Singers:రాహుల్ సిప్లిగంజ్, గొట్టె కనకవ్వ, గన్నోర దాసు లక్ష్మి, పాలమూరు జంగిరెడ్డి, నర్సన్న (నల్గొండ గద్దర్), కాసర్ల శ్యామ్
Lyrics:కాసర్ల శ్యామ్
Music:సంతోష్ నారాయణన్

Dhoom Dhaam Dhosthaan Song Lyrics Telugu – Dasara

ఉంటె వైకుంటం
లేకుంటే ఊకుంటం
అంతలావైతే
గుంజుకుంటాం
తింటం పంతం..

అయితై అయితై అయితై
బద్దాల్ బాషింగల్ అయితై

అరేయ్ ఎం కొట్టుర్ర భాయ్ కుసుర్రి
నీ యవ్వా..!
మా మావ గాదు సెప్పుడు సారే
మీరు కొట్టుడు సారే
అరేయ్ ఓ నింటీ
ఈళ్ళకి ఇంకో నింటీ పోయిరా
ఎట్ల గోత్రో సుద్ధం నీ యవ్వ..!

పవ్వ గొట్టు పవ్వ గొట్టు
బోటి కూర దానంచుకు వెట్టు
బ్యాండు గొట్టు బ్యాండు గొట్టు
వడ కట్టు లేసూగెటట్టు

గుద్దితే సూస్కో ఓ అధ్ధ సేరు
గజ్జల గుర్రం ఈ సిల్కు బారు
ఇచ్చి పడ్డాం చల్ గుచ్చి పడెద్దం
ఎవ్వడు అడ్డంమొస్తాడో చూద్దాం

బాంచెత్….!!!

ధూమ్ ధామ్ ధోస్థాన్
ఇరగ మరగ చేద్దాం
ధూమ్ ధామ్ ధోస్థాన్
ఇరగ మరగ చేద్దాం
ధూమ్ ధామ్ ధోస్థాన్
ఇరగ మరగ చేద్దాం

తిక్క టేకం తిక్క టేకం
తిక్క టేకం తిటక్ తిటక్
తిక్క టేకం తిక్క టేకం
తుర్రా తుర్రా తుర్రా


కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్
సుట్టురా దొస్తుల్ గివ్వే మా ఆస్తుల్
జమ్మిని బొగ్గును బంగారమే అంటాం
బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం

డొక్కలు నింపే ఊరేయ్ మా అవ్వ
జేబులు నింపే రైలే మా అయ్య
బర్ల మొత ఆ సెర్ల ఈత
ఇగ కోడికూత మాకేం యెరుక

బాంచెత్….!!!

ధూమ్ ధామ్ ధోస్థాన్
ఇరగ మరగ చేద్దాం
ధూమ్ ధామ్ ధోస్థాన్
ఇరగ మరగ చేద్దాం
ధూమ్ ధామ్ ధోస్థాన్
ఇరగ మరగ చేద్దాం
ధూమ్ ధామ్ ధోస్థాన్
ఇరగ మరగ చేద్దాం
ధూమ్ ధామ్ అరే ధామ్ ధామ్
భలే భలే భలే..
హ హు హ హే..

చిత్తు చిత్తుల బొమ్మ
శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దోరికేనమ్మో
ఈ వాడలోన

రాగి బింధే తీస్కా
రమణి నీళ్లకుబోతే
రాములోరు యెదురాయేనమ్మో
ఈ వాడలోన

తీట లెక్కల్ జేస్తేనే జోరు
ఘాటుగా ఉండలేరా బతుకు తీరు
నల్లి బొక్కల్ జూతే ఉషారు
ఏం తింటావ్ రా ఉప్పులేని పప్పు చారు

ఘోషి గొంగడి మా కట్టు బొట్టు
యెట్లైతే గట్లయితది సూస్కుంధాం పట్టు
అంబలి గట్కా మాధి రాచ పుటకా
పూట పూట మాకే దసరా

బాంచెత్….!!!

ధూమ్ ధామ్ ధోస్థాన్
ఇరగ మరగ చేద్దాం
ధూమ్ ధామ్ ధోస్థాన్
ఇరగ మరగ చేద్దాం
ధూమ్ ధామ్ ధోస్థాన్
ఇరగ మరగ చేద్దాం
ధూమ్ ధామ్ ధోస్థాన్
ఇరగ మరగ చేద్దాం
ధూమ్ ధామ్ అరే ధామ్ ధామ్
భలే భలే భలే..
హు హ హు హే..

Dhoom Dhaam Dhosthaan Song Lyrics Telugu – Video

Related: Dhoom Dhaam Dhosthaan Song Lyrics in English