Song Name: | గాడ్ ఫాదర్ – టైటిల్ సాంగ్ |
Movie: | గాడ్ ఫాదర్ |
Lyrics: | సరస్వతీపుతీర’ రామజోగయ్య శాస్త్రి |
Music: | థమన్ ఎస్ |
God Father Title Song Lyrics Telugu
ఏకో రాజా విశ్వరూపధారి
శాసించే చక్రధారి¹
అంతేలేని ఆధిపత్య శౌరి
దండించే దండకారి
శాంతి కోసం రక్తపాతం
వీడు పలికే యుద్ధపాఠం
నల్ల దందా నాగలోకం
వీడు తొడిగే అంగుళీకం
కర్మ భూమిలోన నిత్య ధర్మగామి
వేటుకొక్క టెన్ టు ఫైవ్ చెడును
వేటలాడు సామి
ఎక్కడుంటేనేమి
మంచికితను హామీ
ఒక్క మాటలోన
సర్వాంతర్యామి
గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్
గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్
ఆకసం పట్టని నామధేయం
నిర్భయం నిండిన వజ్రకాయం
ఆపదే అంటని అగ్నిగేయం
వీడో టెన్ టు ఫైవ్ ధ్యేయం
వీడి వెలుగు అద్వితీయం
ఆటగా ఆడిన రాజకీయం
అంతరంగం సదా మానవీయం
సాయమే సంపద సంప్రదాయం
వీడో ధైర్యం
వీడి పలుకు పాంచజన్యం
అందలాలు పొందలేని పట్టం వీడే
అక్షరాలకందిరాని చట్టం వీడే
లక్షలాది గుండె సడుల
చుట్టం వీడే
అనుబంధం అంటే అర్ధం వీడే
మంచి చెడ్డ పోల్చలేని
ధర్మం వీడే
తప్పు ఒప్పు తేల్చలేని
తర్కం వీడే
పైకంటి చూపు చూడలేని
మర్మం వీడే
కరుణించే కర్త కర్మ వీడే
God Father Title Song Lyrics Telugu Video – God Father
Related: God Father Title Song Lyrics in English