Song Name:ఓ సీతా హే రామా
Movie:సీతా రామం
Singers:SPB చరణ్ మరియు రమ్య బెహరా
Lyrics:అనంత్ శ్రీరామ్ సంగీతం: విశాల్ చంద్రశేఖర్
Music:విశాల్ చంద్రశేఖర్

Oh Sita Hey Rama Song Lyrics Telugu

ఓ సీతా వదలనిక తోడవుతా
రోజంతా వెలుగులిడు నీడవుతా
దారి నడిపేనే చేతి గీత
చేయి విడువక సాగుతా
తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే
కలని నేనవుతా
హై రామ ఒకరికొకరవుతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
రేపెం జరుగునో రాయగలమా
రాసే కలములో మారుమా
జంటై జన్మని గీయగలమా
గీసే కుంచెనే చూపుమా
మెరుపులా ఉరుములా
దాగుండే నిజము చూడమ్మా
ఓ సీతా వదలనిక తోడవుతా
హై రామ ఒకరికొకరవుతామా

నేరుగా పైకి తెలుపని
పలుకులన్నీ నీ చూపులై
నేలపై వాలుతున్నవి
అడుగు అడుగున పువ్వులై
ఓ వైపేమో ఓపలేని మైకం
లాగుతోంది మరో వైపు లోకం
ఏమి తోచని సమయమా
ఏది తేల్చని హృదయమా
ఏమో బిడియము నియమము నన్నాపే
గొలుసు పేరేమో

నిదురలేపడు ఒక్క నీ పేరే
కలవరిస్తానులే
నిండు నూరేళ్లు కొలువని తెలిసి
జాగు చేస్తావులే
ఎపుడు లేదే ఎదో వింత బాధే
వంతపాడే క్షణం ఎదో లాగే
కలిసొస్తావా ఓ కాలమా
కలలు కునుకులా కలుపమా
కొలిచే మనిషికి ఓ కొలువుండేలా
మాయ చూపమ్మ
హై రామ ఒకరికొకరవుతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
దారి నడిపేనే చేతి గీత
చేయి విడువక సాగుతా
తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే
కలని నేనవుతా

Oh Sita Hey Rama Song Lyrics Video – Sita Ramam

Related: Oh Sita Hey Rama Song Lyrics in English